ఉగ్రవాద
చర్యలకు పాల్పడుతున్న హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని
బెంజిమన్ నెతన్యాహు అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన
సందర్భంగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరువురి మధ్య సంభాషణలో భాగంగా హమాస్ తో
పాటు పశ్చిమ ఆసియా, ఇతర దేశాల తీరు,య వారి
స్పందనపై కూడా చర్చించారు.
హమాస్
కార్యకలాపాలను సమూలంగా తుడిచి వేసే వరకు తమ పోరు కొనసాగుతుందని నెతన్యాహు పునరుద్ఘాటించారు.
ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడిన వివరాలను ఎక్స్ వేదికగా
పంచుకున్నారు.
తమపై
హమాస్ దళాలు అత్యంత క్రూరమైన, హేయమైన దాడులకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసిన
నెతన్యాహు..హమాస్ దళాలను మిగలకుండా చేస్తామన్నారు.
నెతన్యాహు
తో ఫోన్ కాల్ సందర్భంగా గాజా స్ట్రిప్ లో జరుగుతున్న రక్తపాతం, అశాంతి గురించి పుతిన్ ప్రస్తావించారని రష్యా
విదేశాంగ మంత్రి తెలిపారు.
గాజా స్ట్రిప్
లో హింస మరింత పెరగకుండా రష్యా తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాధారణ
పరిస్థితుల నెలకొల్పేందుకు ఇరువర్గాలు ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు.
హమాస్ దాడుల్లో మరణించిన వారికి రష్యా అధినేత నివాళులు తెలిపారు.