ఒంగోలు
పోలీసుల తీరుపై మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర
అసహనం వ్యక్తం చేశారు. నకిలీ భూ దస్తావేజుల కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బాలినేని
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గన్మెన్ లను
ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు.
కేసుతో ప్రమేయమున్నఎంతటి
వారినైనా అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
అసలు
దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని,
తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదన్నారు.
నాలుగేళ్ళ నుంచి ఇలాంటి
విచిత్ర పరిస్థితులు చూస్తున్నామంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.
నకిలీ
భూపత్రాల కేసులో ఇప్పటి వరకు 10 మంది అరెస్టు అయ్యారు. ఎంతటి వారినైనా
వదిలిపెట్టవద్దని మూడు రోజుల కిందట ఎస్పీని బాలినేని కోరారు. కేసుతో సంబంధముంటే తన
పక్కనున్న వారినైనా వదిలిపెట్టవద్దని కోరారు.