రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాలో అడుగుపెట్టారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం మొదలు పెట్టి పదేళ్లైన సందర్భంగా బీజింగ్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సమావేశాల్లో పుతిన్ పాల్గోనున్నారు. బెల్డ్ అండ్ రోడ్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా రష్యా అధ్యక్షుడిని కోరడంతో పుతిన్ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. రేపు చైనా అధ్యక్షుడితోనూ పుతిన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరవాత పుతిన్ రష్యా దాటి పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన విదేశాల్లో పర్యటించడం లేదని తెలుస్తోంది. రష్యా అనుకూల ఇరాన్లో పుతిన్ ఇటీవల పర్యటించారు. కిర్గిస్థాన్‌లో పుతిన్ పర్యటించినా అది కూడా రష్యాలో భాగమే.
మార్చిలో ఐసీసీ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఐసీసీ సభ్యత్వం ఉన్న దేశాల్లో పుతిన్ అడుగు పెడితే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంటుంది. ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా బ్రిక్స్ సమావేశాలకు, ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశాలకు కూడా పుతిన్ హాజరుకాలేదు.