స్కిల్
డెవలప్మెంట్ కేసులో మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై
హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన
మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు, దాదాపు 40 రోజులుగా రాజమండ్రి
సెంట్రల్ జైల్లో ఉంటున్నారు.
ఈ
కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన
తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై మూడు రోజుల కిందట హైకోర్టు
విచారణ చేపట్టగా వాదనలు వినిపించేందుకు సమయం కావాలని చంద్రబాబు లాయర్లు
న్యాయమూర్తిని కోరారు. దీంతో నేటికి వాయిదా పడింది. నేడు కూడా చంద్రబాబు తరఫు
లాయర్లు సమయం కోరడంతో న్యాయమూర్తి ఈ నెల 19కి విచారణను వాయిదా వేశారు.
మరోవైపు
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు
చేయాలని సీఐడీ లాయర్లను ఆదేశించింది.