స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఐదుగురి ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్న తరవాత తీర్పును ఇవాళ వెలువరించింది. కుటుంబంలో భాగం కావాలనేది మానవ లక్షణంలో ప్రధాన భాగమని, స్వీయ అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు చేయదని తెలిపింది.ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు చేయాలా లేదా అనే విషయాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుందన్నారు. కోర్టులు చట్టాలు చేసే వ్యవహారాల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది.
వివాహ వ్యవస్థలో స్థిరమైన మార్పులేదని అని చెప్పడం సరికాదు కానీ, ఒకరితో ఒకరు ప్రేమ, అనుబంధాన్ని అనుభవించడం, మనల్ని మనషులుగా భావించేలా చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది. వివాహం జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయంగా భావించవచ్చు. స్వలింగ సంపర్కం కోరుకునే వ్యక్తులపై వివక్ష చూపలేమని కోర్టు అభిప్రాయపడింది.అలా చేస్తే వారి ప్రాధమిక హక్కులను ఉల్లంఘిండచమే అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.