ఓ
ఉపాధ్యాయుడు, విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడి తల్లిని చేశాడు.
సదరు బాధిత విద్యార్థిని బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలిక తల్లి
ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు, నిందితుడిపై 376, 506 సెక్షన్ల కింద
అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కదిరి
నియోజకవర్గానికి చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి
చదువుతోంది. సదరు బాలిక స్కూలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒంటిరిగా ఉన్న ఉపాధ్యాయుడు
రెడ్డి నాగయ్య అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో
పేర్కొన్నారు.
తర్వాత కూడా బెదిరించి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని
చెప్పారు.
శనివారం
బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి
తీసుకెళ్ళారు. అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలుకి రక్తం తక్కువ ఉండటంతో
వైద్యులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి
తరలించి చికిత్స అందిస్తున్నారు.