దేవదేవుడు
కొలువైన తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. నేటి ఉదయం
స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు.
దుష్ట
శిక్షణ, శిస్ట రక్షణ కోసం దేవదేవుడు సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం
పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.
ఉదయం నిద్ర
లేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం ముఖ్యమైనది. స్వామి వారి సింహ వాహనాన్ని
దర్శిస్తే సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయాన్ని అందుకుంటారని నమ్ముతారు.
శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి నేటి రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి
వాహనసేవ నిర్వహిస్తారు.