దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ సూచీలు కూడా పరుగులు తీశాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 298 లాభంతో 66465 వద్ద మొదలైంది. నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో 19814 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.24 వద్ద ఉంది.
సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్‌యూఎల్ నష్టాల్లో ఉండగా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టైటన్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెప్టెంబరులో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్భణం మైనస్ 0.26 శాతంగా నమోదైంది. ఆహార వస్తువులు, కూరగాయల ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్దానికి త్వరగా ముగింపు పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరం కావడంతో సోమవారం అమెరికా, యూరప్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి.