కుల
గణనలో భాగంగా ట్రాన్స్జండర్లను ప్రత్యేక కులంగా చూపేలా ఉత్వర్వులివ్వాంటా ఆ
కమ్యూనిటీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బీహార్ ప్రభుత్వం
చేపట్టిన కులగణన సర్వేలో ట్రాన్స్జండర్ల కోసం ప్రత్యేక కేటగిరీకి కేటాయించారు.
దానికి బదులు ప్రత్యేక కులం కేటగిరీ కేటాయించాలంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం, వ్యాజ్యాన్ని
తిరస్కరించింది. మగ, ఆడ, ట్రాన్స్జండర్ల కేటగిరీలుగా విభజన చేయడంతో గణాంకాలు రాష్ట్రప్రభుత్వం
దగ్గర అందుబాటులో ఉంటాయన్నారు. అంతే కానీ ట్రాన్స్జండర్లును
ప్రత్యేక కులంగా చూడటం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.
వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు కానీ
ప్రత్యేక కులంగా మాత్రం చూడలేమని ధర్మాసనం చెప్పింది. వివిధ కులాలకు చెందిన వారు
ట్రాన్స్జండర్లగా ఉన్నప్పుడు వారందరినీ ఒకే కులంగా ఎలా చూడగలమని ప్రశ్నించింది.
రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ధర్నా