పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని పిటిషన్లో కోరారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టం అమలు ఆలస్యం కావడంపై కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు మహిళా బిల్లు నారీ వక్తి వందన్ అధినియమ్ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇటీవల రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో చట్టంగా మారింది. జగనణన, డీలిమిటేషన్ తరవాత మహిళా బిల్లు అమలు చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.