అమరావతి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు
బెయిల్ పిటీషన్ విచారణ హైకోర్టులో వాయిదా పడింది. సీఐడీ 500 పేజీల కౌంటర్ దాఖలు
చేసింది. విచారణను బుధవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు.
అప్పటి
వరకు చంద్రబాబు ముందస్తు బెయిలును కోర్టు
పొడిగించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పై కూడా అప్పటి వరకు విచారించవద్దని
ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి
రాజధాని అభివృద్ధిలో భాగంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డు
ఎలైన్మెంట్ మార్చి అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు,
మాజీమంత్రి నారాయణ నిందితులుగా ఉన్నారు. దీంతో బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టును
ఆశ్రయించారు.
ఇన్నర్
రింగు రోడ్డు కేసులో మాజీమంత్రి నారాయణ కుటుంబ సభ్యులు కూడా ముందస్తు బెయిల్
కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ హైకోర్టులో
మరోసారి వాయిదా పడింది. . ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయినందున ఈరోజు తీర్పును
వెలువరిస్తామని హైకోర్టు గత విచారణ సమయంలో తెలిపింది. అయితే ఈ కేసులో కొత్త
ఆధారాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోని తీసుకుని విచారించాలని సీఐడీ మరో పిటిషన్ వేసింది.
కేసును రీఓపెన్ చేయాలని పిటిషన్ వేసింది.
కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు..
తదుపరి విచారణను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. కేసు రీఓపెన్ పై ప్రతివాదులు కౌంటర్ వేయాలని సూచించింది.