విశాఖకు
మకాం మార్చడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మరోసారి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు, పరిపాలనా విభాగాన్నిఅంతటిని తరలించి
పాలన చేస్తామని చెప్పారు. విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్, ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ ఆఫీసును
ప్రారంభించారు. అనంతరం జీవీఎంసీ బీచ్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించారు.
ఇన్ఫోసిస్
రాకతో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
హైదరబాద్, బెంగళూరు మాదిరి వైజాగ్ ఐటీ హబ్ గా
మారుతోందన్న సీఎం, ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ గా
మారిందన్నారు. పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు.
వైజాగ్ లో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని కంపెనీల ఏర్పాటుకు
ముందుకు వస్తే మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ప్రభుత్వ
యంత్రాంగం స్పందిస్తుందన్నారు.