అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు పరిగణనలోకి తీసుకుని విచారించాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. సీఐడి ఇచ్చిన కొత్త ఆధారాలను కోర్టు పరిశీలించింది. కేసు తిరిగి ప్రారంభించడంలో అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. సీఐడీ అధికారులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్ అందించారు. మరిన్ని ఆధారాలు మంగళవారం అందిస్తామని సీఐడీ తెలిపింది. అనంతరం ఈ కేసును హైకోర్టు నవంబరు 1వ తేదీకి వాయిదా వేసింది.
అసైన్డ్ భూముల కేసులో హైకోర్టు ఇప్పటికే విచారణ పూర్తి చేసింది. ఇందులో నలుగురి పేర్లు కొత్తగా చేర్చినట్లు సీఐడి తెలిపింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి నారాయణ గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.