తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీవారు శ్రీమలయప్పస్వామిగా కటాక్షం ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రధానం చేశారు.
ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య స్వామి వారి హంస వాహన సేవ జరగనుంది. ఇందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.