క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన ఒన్డేలో ఇంగ్లాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి ఆఫ్ఘన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు చేసింది. 285 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు 40.3 ఓవర్లకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 215 పరుగులు చేసి ఆఫ్ఘన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఆఫ్ఘన్ జట్టులో రహ్మానుల్లా గుర్భాజ్ 57 బంతుల్లో 80 పరుగులు, ఇక్రమ్ అలిఖిల్ 66 బంతుల్లో 58 పరుగులతో చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్ 61 బంతుల్లో 66 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. ముజీబ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘన్ తొలి విజయం నమోదు చేసింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్