వన్డే
క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా న్యూదిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్,
ఆప్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. తొలుత ఆప్ఘన్ బ్యాటింగ్ చేసి 285 పరుగుల
లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్
బౌలర్లు ఆదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా, మార్క్ వుడ్ 2 పడగొట్టారు. రీస్
టాప్లే , లియామ్ లివింగ్ స్టన్ , జో రూట్ తలా ఒక వికెట్
పడగొట్టారు.
ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 57 బంతుల్లో 80 పరుగులు చేయగా,
ఇబ్రహీం జద్రాన్ 48 బంతుల్లో 28 రన్స్ చేశారు. గుర్బాజ్ –జద్రాన్ జోడీ తొలి వికెట్
కు 114 పరుగులు జోడించిన అనంతరం జద్రాన్ ఔట్ అయ్యాడు. 18.4 వ ఓవర్ లో రహ్మాత్ షాకు
పెవిలియన్ చేరాడు.
మరుసటి బంతికే గుర్బాజ్
కూడా రనౌటు అయ్యాడు.
ఇక్రమ్
అలీఖిల్, రషీద్ ఖాన్ జోడీ ఏడో వికెట్ కు
43 పరుగులు జోడించారు. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో జో రూట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
రషీద్ ఖాన్ కూడా ఔటయ్యారు. 44.1 ఓవర్ల తర్వాత ఆప్ఘనిస్తాన్ స్కోరు 7 వికెట్ల
నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం 49.5 ఓవర్లకు గాను 284 పరుగులు చేసి ఆలౌటైంది.