దేశ రాజధాని ఢిల్లీలో ఈ సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. సాయంత్రం 4.08 గంటల ప్రాంతంలో భూమి కదిలిందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (National Centre for Seismology-NCS) ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదయిందని ఎన్ సీ ఎస్ తెలిపింది. ఢిల్లీ ఎన్ సీఆర్ రీజియన్ పరిధిలో 28.41 అక్షాంశాలు,77.41 రేఖాంశాల ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని, ఫరీదాబాద్, హర్యానా కు 9కిలోమీటర్ల దూరంలో కంపనాలు కేంద్రీకృతమయ్యాయని ఎన్ సీఎస్ వివరించింది.
రెండురోజుల్లో రెండోసారి..
దేశ రాజధాని ప్రాంతంలో గత రాత్రి నుంచి ఇలా భూమి కంపించడం ఇది రెండోసారి. అక్టోబరు 3న రాత్రి వేళలోనూ భూకంపం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి పరుగులు తీశారు. కాగా వరుసగా మరుసటి రోజే ఇలా జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.