నేషనలిస్టు
కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మాజీ
ఎంపీ, ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈశ్వర్ లాల్
శంకర్ లాల్ జైన్ లాల్వానికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. విండ్మిల్స్,
బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలు వంటి 70 రకాల ఆస్తులను సీచ్ చేసింది. ఆస్తుల విలువ
రూ. 315 కోట్లు ఉంటుందని అంచనా.
రాజమ్ మల్
లాల్ చంద్ జ్యువెల్లర్స్, ఆర్ఎల్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, మన్రాజ్
జ్యువెల్లర్స్ సంస్థలకు శంకర్ లాల్ ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. బ్యాంక్
ఫ్రాడ్, మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఆయన పై అభియోగాలు ఉన్నాయి.
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.352.49 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారన్నది ఈశ్వర్ లాల్
పై ఉన్న ఆరోపణ. ఈ మేరకు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. గతంలోని
ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ పలు రికార్డులను స్వాధీనం చేసుకుంది.