మాజీ
ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం భారతీయులందరికీ ఆదర్శనీయమని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. విజయవాడలో నిర్వహించిన అబ్దుల్ కలాం
జయంతి వేడుకల్లో పాల్గొన్న పురందరేశ్వరి… విభిన్న రంగాల్లో కలాం ప్రతిభావంతుడని
కొనియాడారు.
శాస్త్రసాంకేతిక రంగాలతో పాటు సంగీతంలోని ఆయనకు ప్రావీణ్యం ఉందన్నారు.
డీఆర్డీఏ, ఇస్రోలో కలాం చేసిన పరిశోధనలు నేటి తరానికి మార్గదర్శనంగా
నిలిచాయన్నారు.
భారతీయ
జనతా పార్టీ ప్రవచించే ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కు అబ్దుల్ కలామే స్ఫూర్తి
అన్నారు.
రక్షణ, వ్యవసాయం, వైద్యం రంగాల్లో ఎన్నో ఆవిష్కరణల కారణమైన మహోన్నతుడు
అని ప్రశంసించారు.
ఈ
సందర్భంగా అబ్దుల్ కలాం సన్నిహితులు, పద్మశ్రీ
అవార్డు గ్రహీత నాదస్వర విద్వాంసుడు సుబానీ దంపతులను సన్మానించారు.
ఈ
కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షత వహించగా, రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎన్టీఆర్ అభిమాని. బెస్త సామాజికవర్గం రాష్ట్ర
అధ్యక్షుడు చిన వీరన్న తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. షేక్ బాజీ ఆధ్వర్యంలో
ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ నేతలు కూడా బీజేపీ లో చేరారు.