ఆట అన్నాక ఎవరో ఒక్కరే విజేతగా నిలుస్తారన్నది జగమెరిగిన సత్యం. ఈ నిజాన్ని పాక్ కోచ్ మికీ ఆర్థర్
ఇంకా ఒంటబట్టించుకోలేదేమో ? అందుకే తమ జట్టు ఓటమికి కుంటి సాకులు వెదుకుతున్నాడు.
నరేంద్రమోదీ మైదానంలో పాక్ జట్టుకు అనుకూలంగా మద్దతు లభించలేదని, పాక్ కు
మద్దతుగా డప్పు కొట్టలేదని..దిల్ దిల్ మ్యూజిక్ పెట్టలేదని..అందుకే తమ జట్టు
ఓడిపోయిందంటూ చెప్పుకొస్తున్నాడు. ఇది అంతర్జాతీయక్రికెట్ ఈవెంట్ లా లేదని,
బీసీసీఐ వేడుకను తలపించిందని అక్కసు వెళ్లగక్కాడు. ఇలా అంటూనే పాక్ ఓటమికి ఇవే కారణాలని మాత్రం చెప్పలేనన్నాడు.” ఆటగాళ్ల ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేసిందని, తరువాయి మ్యాచుల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తపడతామ”సమాధానమిచ్చాడు.
ఆర్థర్ వ్యాఖ్యలు సరికావు
అహ్మదాబాద్ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్ లా లేదు. ఇరుదేశాల మధ్య జరిగిన
ద్వైపాక్షిక సిరీస్ ను తలపించిందంటూ పాక్ కోచ్ మికీ ఆర్థర్ వ్యాఖ్యలను ఆ దేశ మాజీ పేసర్ వసీమ్ ఆక్రమ్ కొట్టిపారేశాడు. “ఆర్థర్ ఎందుకిలా మాట్లాడాడో అర్థం కావడంలేదన్నారు. ఆట అన్నాక గెలుపోటములు సహజం.ఎందుకు ఓడిపోయాం ?ఎక్కడ లోపముంది? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? అనే వాటిపై
దృష్టిసారించకుండా అనవసర విషయాలను ప్రస్తావించడం సరికాద”ని ఆక్రమ్ హితవు పలికాడు.
వసీమ్ వ్యాఖ్యలకు మరో పాక్ మాజీ ఆటగాడు మొయిన్ ఖాన్ మద్దతుగా నిలిచాడు. “ఓటమిని తప్పుదోవ పట్టించేందుకు ఆర్థర్ ప్రయత్నిస్తున్నాడు. భావోద్వేగ వ్యాఖ్యలతో సానుభూతి పొందాలనుకోవడం పొరపాటని..వీటిని విస్మరించి కోచ్ గా తన బాధ్యతను గుర్తెరగాల”ని మొయిన్ ఖాన్ అభిప్రాయం వ్యక్తంచేశాడు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్