పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ
మీడియా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పాలస్తీనా భూభాగాన్ని గత 70
ఏళ్ళుగా ఇజ్రాయెల్ ఆక్రమించిందనీ… వారి అక్రమాలపై ప్రపంచం మౌనంగా ఉందనీ
వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఒక బహిరంగ సభలో ఒవైసీ
ప్రసంగిస్తూ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంపై స్పందించారు. ‘‘గాజాలో 21లక్షల జనాభా
మాత్రమే ఉంది. వారిలో 10లక్షల మంది ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. దానిగురించి ప్రపంచం
మాట్లాడడం లేదు. వాళ్ళను చంపుతున్నదెవరో చూడండి. గాజాలోని నిరుపేద ప్రజలు మీకేం హాని
కలిగించారు? ఈ విషయమై మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వారు చేస్తున్న
అత్యాచారాలు మీడియాకు కనిపించడం లేదు’’ అని విరుచుకుపడ్డారు.
గాజాలోని ప్రజలను దక్షిణ దిశకు వెళ్ళిపోవలసిందిగా
ఇజ్రాయెల్ సైన్యం ఇచ్చిన పిలుపుపైనా ఒవైసీ స్పందించారు. ‘‘మీ ఇంట్లో రెండు రోజులుగా
నీటిచుక్క రావడం లేదు. సంబంధిత అధికారులను మీరు ఎలా కలుస్తారు? గాజాలో ఇఫ్పుడు
తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, ఆస్పత్రుల్లో మందులు లేవు. అయినా
అక్కడి జనాలు దక్షిణానికి వెళ్ళిపోవాలని ఇజ్రాయెల్ చెబుతోంది’’ అని మండిపడ్డారు.
ఇజ్రాయెల్‌ను యూదులు ఆక్రమించారనీ, ఆ భూమి
వాస్తవానికి ముస్లిములదేననీ ఒవైసీ వాదన సారాంశం. విచిత్రం ఏంటంటే యూదులు ఇజ్రాయెల్‌లో
నివాసముండడం మొదలుపెట్టిన నాటికి ఇస్లాం అన్న మతమే లేదు. యూదు మతం తర్వాత క్రైస్తవం,
ఆ తర్వాత కొన్ని వందల యేళ్ళకు ఇస్లాం మతం ఏర్పడ్డాయి. ఇతర మతాలను తొక్కేసి ప్రపంచమంతా
తమ మతాన్నే వ్యాపింపజేయాలన్నది ముస్లిముల సిద్ధాంతం. దానికి అనుగుణంగానే యూదులను
వారి భూభాగం నుంచి అరబ్బులు తరిమేసారని చరిత్ర చెబుతున్న వాస్తవం. ముప్పేట దాడులను
తట్టుకోలేకనే యూదులు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు వలసపోవడం, స్వదేశాన్ని
సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఆధునిక ప్రపంచం చూసిన, చూస్తున్న, కళ్ళముందరి
చరిత్ర. ఇస్లాం పుట్టక ముందునుంచీ ఉన్న యూదులు తమ భూభాగాన్ని ఆక్రమించారని ఒవైసీ
అనడంలోనే, ముస్లింలు తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవరూ ఉండకూడదన్న ఉగ్రవాద భావజాలం
ప్రకటితమవుతోంది.
తాజా పరిస్థితులకు కారణం హమాస్ రాకెట్ దాడులు
అన్న విషయాన్ని వాటంగా వదిలేసిన ఒవైసీ… ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని క్రూరుడు,
నేరస్తుడు అని నిందించారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామన్న యూపీ సీఎం యోగీ
ఆదిత్యనాథ్ ప్రకటనను తప్పుపట్టిన ఒవైసీ, తాను కచ్చితంగా పాలస్తీనా పక్షానే
ఉన్నానంటూ, పాలస్తీనా జెండాను ధరిస్తానంటూ ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల దృష్ట్యా అక్కడి విద్యార్ధులను, అతివాదులను దృష్టిలో
పెట్టుకుని చేసిన ప్రకటనను ఒవైసీ తనకు వర్తించుకుని భుజాలు తడుముకున్నారు.
పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవాలని మోదీ పిలుపునివ్వాలంటూ
ప్రధానమంత్రిని సైతం బురదలోకి లాగడానికి ఒవైసీ ప్రయత్నించారు. ఇప్పటికే భారత
ప్రభుత్వం అధికారికంగా ఇజ్రాయెల్ అనుకూల వైఖరి ప్రకటించి, సమస్య పరిష్కారానికి
శాంతియుత చర్చలే మార్గమని వెల్లడించినప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒవైసీ
నైజాన్ని బహిర్గతం చేస్తోంది.