టీడీపీ
అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై రాష్ట్రప్రభుత్వ వైఖరి అమానవీయంగా ఉందని
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష
సాధింపు ధోరణి సరికాదని హితవు పలికారు. ఆయన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత
వహించాలన్నారు. చంద్రబాబు విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని విచారణ
చేపట్టాలని కోరారు.
మరోవైపు
చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి
స్థాయి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను కోరారు.
చంద్రబాబును
ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయిన సమయంలో కొందరు అనధికారికంగా వీడియోలు
తీస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆయన వ్యక్తిగత
భద్రతకు భంగం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి
లేఖ రాశారు.
నైపుణ్యాభివృద్ధి
కేసులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు, సీఐడీ ఆఫీసులో విచారించినప్పుడు, రిమాండ్
కు పంపినప్పుడు వీడియో, ఫోటోలు తీసి ఓ మీడియా సంస్థల్లో ప్రసారం చేశారని , ఆవిషయమై
ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా తగు చర్యలు
చేపట్టాలని కోరారు.