తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్ధుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 55 మంది ప్రముఖులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. తెలంగాణలో వామపక్షాలతో పొత్తుల వ్యవహారం కూడా ఇవాళ తేలనుంది. బుధ, గురువారాల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉంది. తాజాగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసిన జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయనున్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి, అందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు కుందూరు జయవీర్, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ములుగు నుంచి సీతక్క, మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేయనున్నారు.
ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తొలి జాబితాలో వారికి చోటు దక్కలేదు.ఇటీవలే వీరు కాంగ్రెస్‌లో చేరడంతో తొలి జాబితాలో వీరి పేర్లు ప్రకటించలేదని తెలుస్తోంది. రెండో జాబితాలో వీరికి స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీ విమానాశ్రయ అధికారులపై జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం