తెలుగు
నాట అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ నవరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా
ప్రారంభమయ్యాయి. జగన్మాత స్మరణతో తెలుగునేల పరమపవిత్రమవుతోంది. ఆలయాలతో పాటు వ్యాపార
ప్రదేశాలు, కార్యాలయాల్లో జగదాంబ ప్రతిమలు ఏర్పాటు చేసి వైభవంగా శరన్నవరాత్రులు
ప్రారంభించారు. అమ్మవారి చల్లని చూపు, కరుణాకటాక్షాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలం
కావాలంటూ పూజలు నిర్వహిస్తున్నారు.
బెజవాడ
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర
స్వామివార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దసరా
ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ వారు తొలి రోజు శ్రీబాలా త్రిపురసుందరీదేవిగా భక్తులను
అనుగ్రహిస్తున్నారు. భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారంలో శ్రీబాలాత్రిపుర సుందరీ
దేవిని కొలుస్తుంటారు.
తెల్లవారు
జామున అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం తొమ్మిది
గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు.
అమ్మవారిని
గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు
చేశారు. దుర్గమ్మకు పట్టువస్త్రాలు
సమర్పించారు.
శరన్నవరాత్రి
మహోత్సవాల్లో దర్శనమిచ్చే మహిమాన్వితమైన తల్లి శ్రీబాలాదేవి. శ్రీబాలామంత్రం సమస్త
దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీవిద్యోపాసకులకి
మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువై ఉండే
శ్రీచక్రం మొటి ఆమ్నాయంలో ఉండే మొదటి అమ్మవారే శ్రీబాలాత్రిపుర సుందరీదేవి.
శ్రీశైలంలో
భ్రమరాంబ అమ్మవారు తొలిరోజు శైలపుత్రిగా దర్శనమిస్తున్నారు. నేటి సాయంత్రం నుంచి
అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. సాయంత్రం భృంగి వాహనంపై దేవేరులు
విహరిస్తారు. అమ్మవారు బ్రహ్మచారిణిగా ఆదిదేవుడు మయూర వాహనంపై శ్రీగిరి
మాడవీధుల్లో విహరించి భక్తులను తరింపజేస్తారు.