ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల కూటమి అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించింది. వచ్చే బుధవారంనాడు ఇస్లామిక్ నేషన్స్ జెడ్డాలో సమావేశం కానున్నాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) గాజా పౌరుల ఇబ్బందులు పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. దీనిపై చర్చించేందుకు ఇస్లామిక్ దేశాల కూటమి సౌదీ అరేబియాలోని జెడ్డాలో బుధవారంనాడు సమావేశం కావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్లామిక్ నేషన్స్‌కు సౌదీ అరేబియా అధ్యక్షత వహిస్తోంది.
ఐక్యరాజ్యసమితి తరవాత ఇస్లామిక్ నేషన్స్ ఆర్గనైజేషన్ (OIC) ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కూటమిగా ఉంది. ముస్లిం దేశాల సామూహిక స్వరంగా ఈ కూటమి తనను తాను అభివర్ణించుకుంది. సౌదీఅరేబియా అధ్యక్షతన గాజాలో ప్రజలు ఎదుర్కొంటోన్న ప్రజల సమస్యలపై ఈ కూటమి దేశాల మంత్రుల స్థాయిలో అత్యవసర సమావేశానికి ఓఐసీ పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగిన హమాస్, 1300 మంది అమాయక పౌరులను బలితీసుకుంది. ప్రతీకారదాడులకు దిగిన ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 2215 మంది చనిపోయారు.ఇప్పటికే ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు పాలస్తీనాకు మద్దతు పలికాయి.