అది 31వ ఓవర్లో 3వ బంతి.
49 పరుగులు చేసిన శ్రేయస్ హాఫ్ సెంచరీ మార్క్ చేరుకోడానికి ఒక్క పరుగు కావాలి. దాయాదిపై
గెలవడానికి భారత్‌కు నాలుగు పరుగులు కావాలి. ఆ అవకాశాన్ని ఎలా వదులుకుంటాడు
శ్రేయస్? కొట్టేసాడు ఫోర్. ఆ దెబ్బకి గ్యాలరీ గ్యాలరీ మొత్తం లేచి గెంతింది. భారత్
గెలిచిందన్న నినాదాలతో దద్దరిల్లిపోయింది.
ఐసీసీ వన్డే
ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా జరిగిన పన్నెండో మ్యాచ్‌లో
భారత్ హ్యాట్రిక్ కొట్టింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన
మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించింది. కేవలం 3 వికెట్లు
కోల్పోయి, ఇంకా 117 బాల్స్ మిగిలి ఉండగానే 192 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది.
భారత బౌలర్ల ధాటికి తలవంచిన
పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయి కుప్పకూలిపోయింది. భారత బ్యాట్స్‌మెన్
ధాటికి తలవంచిన పాకిస్తాన్ 30.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లే తీసి, విజయాన్ని సమర్పించుకుంది.
వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్తాన్ జట్లు ఈరోజు మ్యాచ్‌తో కలుపుకుని 8సార్లు తలపడ్డాయి.
గత 7 సార్లూ భారత జట్టే గెలిచింది. ఇవాళ కూడా అదే ఆనవాయితీని కొనసాగించి ‘ఎనిమిదో
స్సారీ మేమే’ అంటూ విజయశంఖం పూరించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ,
డెంగీ జ్వరం నుంచి కోలుకుని వచ్చిన శుభ్‌మన్ గిల్ భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
శుభ్‌మన్ గిల్ 11 బంతుల్లో 4 ఫోర్స్ కొట్టి 16 పరుగుల స్కోర్ సాధించి ఔట్ అయ్యాడు.
తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ కూడా 18 బంతల్లో 3 ఫోర్స్ కొట్టి తను కూడా 16 పరుగుల
వ్యక్తిగత స్కోర్ దగ్గరే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ రంగంలోకి
దిగాడు. రోహిత్-శ్రేయస్ జోడీ స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించారు. రోహిత్ శర్మ
మొత్తం 63 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి, భారత జట్టు
156 పరుగుల వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అతని తర్వాత కె.ఎల్ రాహుల్ రంగంలోకి
దిగాడు. 29 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, శ్రేయస్ అయ్యర్‌కు కీలకమైన
తోడ్పాటునందించాడు. భారత స్కోరు 188 దగ్గరుండగా, తన వ్యక్తిగత స్కోరు 49 పరుగుల
దగ్గరున్న శ్రేయస్ అయ్యర్, 31వ ఓవర్లో మూడో బంతికి విన్నింగ్ షాట్ ఫోర్ బాదాడు.
దాంతో అతని వ్యక్తిగత స్కోర్ 53కు చేరుకుంది, భారత్ విజయానికి కావలసిన 192 పరుగులు
పూర్తి చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లలో
కేవలం 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్
బుమ్రా ’ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.ఈ విజయంతో భారత్, వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించింది.
ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ వరుసగా గెలుపు సాధించింది. అంతేకాదు, పాయింట్ల పట్టికలోనూ
అగ్రస్థానానికి చేరుకుంది. న్యూజీలాండ్ కూడా ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచినా,
నెట్ రన్‌రేట్‌లో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు పట్టికలో మొదటి స్థానానికి
చేరుకుంది.
ఈ మ్యాచ్ చూడడానికి కేంద్ర
హోంమంత్రి అమిత్ షా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి విచ్చేసారు. సాధారణ
ప్రేక్షకుడిలా గ్యాలరీలో తోటి ప్రేక్షకులతో కలిసి, మధ్యమధ్యలో నిలబడి మరీ భారత బ్యాటింగ్‌ను
చూసి, పండుగ చేసుకున్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్