భారత
బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు.
కట్టుదిట్టమైన బంతులతో దాయాది పాకిస్తాన్ జట్టును 200 పరుగులు కూడా చేయకుండానే
ఆలౌట్ చేశారు. భారత్ బౌలర్లలో బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్,
రవీంద్ర జడేజా తలా రెండు వికెట్ల పడగొట్టడంతో పాకిస్తాన్ నామమాత్రపు ప్రదర్శనకే
పరిమితం కావాల్సి వచ్చింది.
వన్డే
ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత్,
పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో జరుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ
ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షా పదివేల
మంది రావడం విశేషం.
పాక్ ఓపెనర్లు షఫీఖ్,
ఇమామ్ బ్యాటింగ్ ప్రారంభించగా బుమ్రా తొలి ఓవర్ వేశాడు. బుమ్రా నాలుగు పరుగులు
ఇవ్వగా రెండో ఓవర్లో సిరాజ్ 12 పరుగులు ఇచ్చాడు. ఇమామ్ ఉల్ హక్ మూడు ఫోర్లు బాదడంతో
పాక్ స్కోరు రెండు ఓవర్లకే 16 పరుగులకు చేరింది.
ఎనిమిదో ఓవర్ లో పాక్ తొలి వికెట్
కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో షఫీక్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 8 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి పాక్ 41 పరుగులు
చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన 12 ఓవర్ మూడో బంతికి పాకిస్తాన్ రెండో వికెట్
కోల్పోయింది. లెంగ్త్ డెలివరీని ఆడబోయిన ఇమామ్, కీపర్ కేఎల్ రాహుల్ కు చిక్కాడు.
దీంతో 73 పరుగుల వద్ద పాక్ రెండో వికెట్ నష్టపోయింది.
25 ఓవర్లు ముగిసే సరికి పాక్ బ్యాట్స్మెన్ 125
పరుగులు చేశారు. 27 వ ఓవర్ ముగిసే సరికి బాబర్, రిజ్వాన్ చెరో 37 పరుగులు చేసి
నిలకడగా ఆడుతున్నారు.
29వ
ఓవర్ నాల్గో బంతికి బాబర్ ఔట్ అయ్యాడు. 50 పరుగులు చేసిన బాబర్ ను సిరాజ్ బౌల్డ్ ఔట్
చేశాడు. 30 ఓవర్లకు గాను పాకిస్తాన్ 157 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
కుల్దీప్
వేసిన 32వ ఓవర్ రెండో బంతికి సాద్ షకీల్ (6) ఔట్ అయ్యాడు. కులదీప్ యాదవ్ తర్వాత ఒకే ఓవర్ లో రెండు
వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్తాన్ 166 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది.
భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 16 పరుగుల వ్యవధిలో
ఐదు వికెట్లు కోల్పోయింది. 35.2 ఓవర్లకు 171/7కి చేరింది.
హార్దిక్ వేసిన 40వ ఓవర్
లో చివరి బంతికి మహ్మద్ నవాజ్(4) ఔటయ్యాడు. మిడాన్ లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి
పెవిలియన్ చేరాడు . జడేజా వేసిన 41వ ఓవర్ మొదటి బంతికి హసన్ అలీ 12 పరుగుల వద్ద
క్యాచ్ ఔట్ కావడంతో పాకిస్తాన్ 187 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 42.5 ఓవర్లలో జడేజా బౌలింగ్ లో హ్యారిస్ రవూఫ్ ఎల్బీడబ్ల్యూగా
వెనుదిరగడంతో పాక్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
టీమిండియా
జట్టు:
రోహిత్
శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్
కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్
ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్
సిరాజ్.
పాకిస్థాన్
టీమ్:
అబ్దుల్లా
షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్
రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్
అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్
అలీ, షహీన్ ఆఫ్రిదీ, హారిస్ రవూఫ్.
పాకి స్తాన్ టీమ్:
అబ్దుల్లా
షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్
రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్
అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్
అలీ, షహీన్ ఆఫ్రిదీ, హారిస్ రవూఫ్.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్