నైపుణ్యాభివృద్ధి
కేసులో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో జుడీషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ
అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే కుటుంబ సభ్యులు చంద్రబాబు తో మిలాఖత్
అయ్యారు. తండ్రిని చూసి బయటకు వచ్చిన లోకేశ్, మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళారు.
రాజమండ్రి
జీజీహెచ్ వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షిస్తోంది.
తమ
అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ శ్రేణులు వరుస
ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ‘‘న్యాయానికి సంకెళ్ళు’’ పేరిట
నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేశ్ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఈ కార్యక్రమాన్ని
నిర్వహించాలని కోరారు. చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకుని నిరసన తెలపాలన్నారు. న్యాయానికి
ఇంకెన్నాళ్ళు ఈ సంకెళ్ళు అని నినదించాలన్నారు. నిరసన ప్రదర్శన ఫొటోలు, వీడియోలు
సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మపోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ
శ్రేణులను కోరారు.
చంద్రబాబును
అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ల దగ్గర ఆయన
అభిమానులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’
పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించేందుకు
ప్రయత్నించారు.
చంద్రబాబు
అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసన కార్యక్రమాన్ని
అడ్డుకున్నారు.