ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో ఢిల్లీ నుంచి టెల్‌అవీవ్‌కు గత వారం భారత్ విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ నెల 18 వరకు ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.
అపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటికే రెండు విమానాల్లో 450 మందిని ఢిల్లీకి తరలించారు.
ఇజ్రాయెల్‌లో 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పనివారుకాగా, దాదాపు వెయ్యి మంది విద్యార్థులు, 2 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. కొందరు వజ్రాల వ్యాపారులు కూడా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారని తెలుస్తోంది.