ఇజ్రాయెల్ గాజాపై జరిపిన భీకరదాడుల్లో హమాస్ మిలిటెంట్ సంస్థ అధిపతి మురాద్ అబు మురాద్ హతమైనట్లు సైన్యం ప్రకటించింది. గాజాలోని హమాస్ తీవ్రవాద శిబారాలపై ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ గత రాత్రి జరిపిన దాడిలో ఉగ్రవాద సంస్థ అధిపతి హతమైనట్లు తెలుస్తోంది. గాజాలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్ విరుచుకుపడింది. గాజా నగరంలో మిలిటెంట్లకు దిశానిర్దేశం చేస్తున్న ప్రాంతాలను గుర్తించి ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగినట్లు ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ అధికారి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గాజాలో దాగిన హమాస్ ఉగ్రవాదుల శిబిరాలపై శుక్రవారం రాత్రి డజన్ల కొద్దీ యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌లో చొరబడ్డ డజన్ల కొద్దీ ఉగ్రవాదులను గుర్తించి చంపివేసినట్లు ఐడీఎఫ్ తాజాగా ప్రకటించింది.
తమ ఆదేశాల మేరకు గాజాలోని పాలస్తీనియన్లు దక్షిణ ప్రాంతం వైపు వెళ్లిపోతున్నారని, ఇది చాలా తెలివైన పని అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోకూడదనే ఉద్ధేశంతోనే ఇలాంటి ఆదేశాలు జారీ చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా ఏరివేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల చెరలో 120 మంది బందీలుగా ఉన్నట్లు సైన్యం ప్రకటించింది.