వన్డే
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి.
నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో దాయాదుల మధ్య రసవత్తర పోరు
క్రీడాభిమానులను అలరించనుంది.
టోర్నీలో
రెండు మ్యాచులు ఆడిన భారత్.. ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్‌పై భారీ విజయాలు సాధించి
జోరు మీద ఉంది.
నెదర్లాండ్, శ్రీలంకను ఓడించిన ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ కూడా
బరిలోకి దిగుతోంది.
వన్డే వరల్డ్‌కప్ లో భారత్ పై పాకిస్తాన్ ఇప్పటి వరకు విజయం
సాధించలేదు. నేటి మ్యాచ్ లో ఆ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ విభాగంలో
పాకిస్తాన్ బలంగా ఉంది. షహీన్ అఫ్రిది నుంచి వచ్చే వేగవంతమైన బంతులు ఎదుర్కోవడం
అంత సులువు కాదు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
గత
రెండేళ్ళలో ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో 59.8 శాతం వికెట్లు తీసి పేసర్లు ఎక్కువ
ప్రభావం చూపారు. ఈ పిచ్ నెమ్మదిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోతుంది. వేడి
వాతావరణం ఉండటంతో పాటు వర్ష సూచనలేదు.
హై
వోల్టేజీ మ్యాచ్ కు ముందు స్టేడియంలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు
చేసింది. సింగర్లు అరిజీత్ సింగ్, శంకర్ మహదేవన్, సుఖ్వీందర్ సింగ్, నేహా కక్కర్
లతో స్పెషల్ మ్యూజిక్ సెర్మనీ నిర్వహించనుంది. సచిన్ టెండూల్కర్, అమితాబ్, రజనీకాంత్
సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇన్నింగ్స్ విరామ సమయంలో కూడా సంగీత కార్యక్రమాలు ఉంటాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్