దసరా
ఉత్సవాల సందర్భంగా భ్రదాచలంలోని రాములవారి
ఆలయంలో ఈ నెల 15 నుంచి 24 వరకు రోజుకో
రూపంలో అమ్మవారి అలంకారాల దర్శనం ఉంటుందని ఈవో రమాదేవి తెలిపారు.
24న విజయదశమి
సందర్భంగా దసరా మండపంలో శమీ వృక్షం దగ్గర ఆయుధ పూజ ఉంటుందన్నారు. అదే రోజు శ్రీరామ
లీలా మహోత్సవం పేరిట రావణవధ నిర్వహించనున్నారు. 28న ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా
శబరి మాత యాత్రను గిరిజన సంప్రదాయంలో నిర్వహించనున్నారు.
డిసెంబర్
23న వైకుంఠ ఏకాదశి
వైకుంఠ
ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23న ఉదయం 5 గంటల నుంచి 6 గంటలకు వరకు ఉత్తర ద్వారంలో
పూజలు ఉంటాయన్నారు. డిసెంబర్ 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు
ఉంటాయన్నారు.
13న
మత్స్యావతారం, 14 కూర్మావతారం, 15న వరాహావతారం, 16న నరసింహావతారం, 17న వామనావతారం,
18న పరశురామావతారం, 19న శ్రీరామవతారం, 21న శ్రీకృష్ణావతారం, 22న ఆళ్వారుల పరమ
పదోత్సవం ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 13 నుంచి23 వరకు నిత్య
కళ్యాణాలను నిలిపివేయనున్నారు. అలాగే డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస
పూజలు ఉంటాయని ఈవో తెలిపారు.