ఇజ్రాయెల్ పై ఉగ్రదాడి చేసిన పాలస్తీనాకు చెందిన హమాస్ ముష్కర మూకలకు
మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ చేశారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేడ్కర్ విగ్రహం
ఎదుట నిరసన చేపట్టారు. నౌజవాన్ భారత్ సభ, దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట ప్లకార్డులు ప్రదర్శించారు.
పాలస్తీనా
వర్ధిల్లాలి, లాంగ్
లివ్ పాలస్తీనా, గాజా
విల్ నెవర్ డై, పాలస్తీనాపై
ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపాలనే ప్రకటనలు ఉన్న ప్లకార్డులతో ర్యాలీ చేశారు. పాలస్తీనాకు విముక్తి కావాలంటూ నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ర్యాలీని అడ్డుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు.
హమాస్ ఉగ్రమూకలకు
అనుకూలంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కిన వీరిపై చర్యలు తీసుకోవాలని పలువురు
కోరుతున్నారు. వీరి మూలాలపైనా,
సదరు సంస్థల కార్యకలాపాలపైనా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని
డిమాండ్ చేస్తున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత హైదరాబాద్ లో నిరసన జరగడం ఇదే మొదటిసారి. ఇటీవలే అలీగడ్
ముస్లిం యూనివర్సిటీలో విద్యార్థులు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్‌కు అనుకూలంగా
ర్యాలీ చేశారు.
భారత ప్రభుత్వం హమాస్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కు అన్ని
విధాలుగా అండగా నిలుస్తామని ప్రకటించినప్పటికీ దేశ విచ్ఛిన్నకర శక్తులు హమాస్,
పాలస్తీనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.