కర్ణాటక
రాజధాని బెంగళూరులో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా నగదు పట్టుబడింది. ఓ ఇంట్లో
పరుపు కింద దాచిన రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మహిళా
కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నారు.
నగల దుకాణాల యజమానులతో పాటు ఇతరుల నుంచి
ఈ డబ్బును సేకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల
ఎన్నికలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.
ఆర్టీనగర్
లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాట్ లో తనిఖీలు చేపట్టిన ఐటీ అధికారులు నగదు స్వాధీనం
చేసుకున్నారు.
బెడ్ కింద 23 పెట్టెల్లో
రూ. 500 నోట్ల కట్టలు గుర్తించారు. వీటిని లెక్కించగా మొత్తం రూ. 42 కోట్లుగా
తేలింది. ఖాళీగా ఉండే ఈ ఫ్లాట్లో ఇంత పెద్ద మొత్తాన్ని దాచారు.
హోస్కోటలోని బిర్యానీ సెంటర్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.
ఓ హోటల్ యజమాని ఇంట్లో 30 కి పైగా స్కానర్లు గుర్తించారు. మరో హోటల్ యజమాని వద్ద
రూ. 1.47 కోట్ల నగదు సీజ్ చేశారు.