మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్ళు కేసులో హైకోర్టు ఆయనకు
మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్లో భాగంగా గురువారం నాడే వాదనలు పూర్తి
కాగా తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.
ఇవాళ ఉదయం తీర్పు వెల్లడించిన కోర్టు,
లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రెండు షూరిటీ బాండ్ల
రూపంలో జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అంగళ్ళు
కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద
కేసులు నమోదు చేశారు.
సాగునీటి
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా అన్నమయ్య జిల్లా ముదివేడులో చంద్రబాబు పర్యటన
సందర్భంగా గొడవలు జరిగాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాళ్ళ దాడి జరగడంతో
ఇరుపార్టీల నేతలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు.
దీంతో ఆగస్టు 8న చంద్రబాబు సహా 179 మందిపై కేసు నమోదైంది. నిందితులందరికీ న్యాయస్థానాలు బెయిల్ మంజూరు
చేశాయి. చివరిగా ఏ1గా ఉన్నచంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.LLU CASE: అంగళ్ళు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్