నైపుణ్యాభివృద్ధి
కేసులో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
అస్వస్థతకు గురయ్యారు. ఎండవేడిమి, తీవ్ర ఉక్కపోతతో డీహైడ్రేషన్‌కు గురైన చంద్రబాబుకు
స్కిన్ అలర్జీ సోకింది. దీంతో ఆయనకు వైద్యం అందించాలని రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు
జైలు అధికారులు లేఖ రాశారు.
వైద్యనిపుణులు
జైలుకు వెళ్ళి చంద్రబాబును పరీక్షించారు. ఆయన స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు
నిర్ధారించి మందులు సూచించారు. వైద్యులు సూచించిన మందులు చంద్రబాబుకు అందిస్తామని
జైలు అధికారులు బులిటెన్ లో పేర్కొన్నారు. చర్మంపై దద్దుర్లతో పాటు బరువు కూడా
బాగా తగ్గినట్లు గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో వెల్లడైంది.
రక్తపోటు
140/ 80 గా ఉండగా, శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉందని, పల్స్ 87(నిమిషానికి), ఎస్పీఓ2-97,
హార్ట్-ఎస్1ఎస్2, లంగ్స్ –క్లియర్, ఫిజికల్ యాక్టివిటీ –గుడ్ అని జైలు అధికారులు
విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు, 33 రోజులుగా రాజమండ్రి జైలులోనే ఉన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో
డీహైడ్రేషన్ కు గురయ్యారు. దీంతో పాటు స్కిన్ అలర్జీతో ఆయన బాధపడుతుండటంతో జైలులోనే
వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నేడు కూడా చర్మవ్యాధి నిపుణులు సూర్యనారాయణ,
సునీత జైలు లోపలికి వెళ్ళి మరోసారి చంద్రబాబును పరీక్షించనున్నారు. ఇన్ ఫెక్షన్ పెరిగితే
చంద్రబాబును ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది.