వన్డే
ప్రపంచకప్ -2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. లక్నో
వేదికగా జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
312
పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కేవలం 177 పరుగులకే కుప్పకూలింది.
రబడ మూడు
వికెట్లు తీయగా, జాన్సన్, కేశవ్, శాంసీ తలా రెండు వికెట్లు తీశారు.
అంతకు
ముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి
311 పరుగులు చేసింది. వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్, వరుసగా రెండో సెంచరీ చేశాడు.
ఓపెనర్ గా వచ్చిన డికాక్ 106 బంతుల్లో 109 పరుగులు చేశాడు.
మార్క్రమ్ 44 బంతుల్లో
56 రన్స్ తో ఆకట్టుకున్నాడు. బవుమా (35), క్లాసెస్(29), జాన్సన్(26) ఇన్నింగ్స్‌కు
తమవంతు సహకారం అందించారు. ఆసీస్ బౌలర్లు మాక్స్వెల్, స్టార్క్ చెరో 2 వికెట్లు
తీశారు.
టార్గెట్
ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది.
70 పరుగులకే
6 వికెట్లు నష్టపోయి అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచింది. మాక్సెవెల్ కేవలం మూడు
పరుగులతో నిరాశ పరచగా, స్టోయినిస్ ఐదు పరుగులకే ఔట్ అయ్యాడు. 20 ఓవర్లు ముగిసే
సమయానికి 80 పరుగులు చేసిన ఆసీస్, 6 వికెట్లు కోల్పోయింది. లోయరార్డర్ లో మిచెల్
స్టార్క్ 27, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 పరుగులు చేసినా అవి ఏ మాత్రం సరిపోలేదు.
ఓపెనర్లు మిచెల్ మార్ష్ 7, డేవిడ్ వార్నర్ 13 విఫలం కావడం ఆసీస్ అవకాశాలను
దెబ్బతీసింది.
రెండు
భారీ విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్, పాయింట్ల
పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఆప్ఘన్, నెదర్లాండ్స్, సరసకు కంగారూ జట్టు దిగజారింది.
టోర్నీలో ఆసీస్ జట్టు ముందంజలో ఉండాలంటే
మిగిలిన 7 మ్యాచుల్లో కనీసం ఆరు గెలవాలి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్