బీజేపీ
రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,
మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం
చేశాయి.
విజయవాడ
వన్‌టౌన్ KBN కాలేజ్ సెంటర్లో బీజేపీ ఎన్టీఆర్
జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
చేశారు.ఆందోళనను విరమించాలని పోలీసులు కోరారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య
వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా తరలించారు.
ప్రజాసమస్యల
పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర
అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ప్రజల ఇబ్బందులను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తే ని పరిష్కరించాల్సిన
బాధ్యత పాలకపార్టీపై ఉంటుందున్నారు. ప్రభుత్వ సలహాదారు మాత్రం అందుకు భిన్నంగా
వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ రాష్ట్రంలో
అరాచక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మద్యం అమ్మకాలపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని కేంద్రాన్ని పురందరేశ్వరి
కోరితే, వైసీపీ నేతలు భయపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కు ఉన్నట్లు తమ అధ్యక్షురాలు
పురందేశ్వరికి నేరచరిత్ర లేదని చురకలు వేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి
బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.