ఫైబర్‌నెట్
కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు పీటీ వారెంట్‌కు కోర్టు ఆమోదం
తెలిపింది. చంద్రబాబును సోమవారం న్యాయస్థానంలో స్వయంగా హాజరు పరచాలని న్యాయమూర్తి
ఆదేశించారు. ఉదయం 10.30 గంటల నుంచి ఐదు గంటలలోపు ప్రత్యక్షంగా హాజరుపర్చాలని
ఉత్తర్వులు జారీ చేశారు.
క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం
చేసుకోవచ్చుఅని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు సూచించారు. చంద్రబాబు తరఫున
దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, సీఐడీ తరఫున వివేకానంద వాదనలు వినిపించారు.
మరోవైపు
చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా పిటిషన్ ను ఏసీబీ కోర్టు
విచారణకు స్వీకరించింది. వాదనలు శుక్రవారానికి వాయిదా వేయాలని సీఐడీ న్యాయవాది
కోరగా న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రస్తుతం న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి.