తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనార్థం భక్తుల కోసం ప్రతి నెలా సేవ టికెట్లు విడుదల చేస్తోంది. ఈ నెల 18న 2024 జనవరి కోటా టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం అక్టోబరు 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 వరకు అవకాశం కల్పించారు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అక్టోబర్ 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అక్టోబర్ 23న 10 గంటలకు అంగప్రదిక్షణం టికెట్లు విడుదల చేయనున్నారు.బ్రేక్ దర్శనం కోటాను అక్టోబర్ 23 ఉదయం 11 గంటలకు, దివ్యాంగులు, వృద్ధుల దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. డిసెంబరు నెల టికెట్లను అక్టోబర్ 27 ఉదయం 10 గంటలకు సేవ కోటా టికెట్లు, 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.