రాష్ట్ర
ప్రజలు, పేదలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏ మాత్రం ప్రేమ లేదని ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు భూమి ఇచ్చిన పాపాన
పోలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో అయినా చంద్రబాబు, పేదలకు మేలు చేయలేదని ఎద్దేవా
చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుప్పంలో 20 వేల ఇళ్ళ పట్టాలిచ్చినట్లు
తెలిపారు.
సామర్లకోటలో
పర్యటించిన సీఎం జగన్, జగనన్న కాలనీలో ఇళ్ళను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో
మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్… చంద్రబాబు, పవన్ పై విమర్శలు గుప్పించారు. 14ఏళ్ళు
ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, రాష్ట్రంలో ఇల్లైనా కట్టుకోలేదన్నారు. గత 52
నెలల్లో చంద్రబాబు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనిపిస్తున్నాడన్నారు.
‘‘చంద్రబాబు,
లోకేశ్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ రాష్ట్రంలో నివాసం ఉండటం లేదు. దత్తపుత్రుడి
శాశ్వత చిరునామా హైదరాబాద్. ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్ళకు మారుతుంది’’ అని పవన్ను
ఉద్దేశించి విమర్శించారు.
ప్యాకేజీ స్టార్ కు తమపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా
ఆలోచించాలన్న సీఎం జగన్, బాబుకు అధికారం పోతే వీళ్ళకు ఫ్యూజులు పోతాయన్నారు.
సీఎం
జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకు వస్తాయి, అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు
వినపడతాయని. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుందని, బాబు
పేరు చెబితే గజదొంగల ముఠా గుర్తుకు వస్తుందన్నారు.
రాష్ట్రంలో
31 లక్షల కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు కేటాయించామన్న సీఎం జగన్, రెండేళ్ళలో పేదల సొంతింటి
కలను నెరవేర్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు
అవుతున్నాయని 7.43 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. మరో 14.33 లక్షల
ఇళ్ళ నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 87 శాతం ఇళ్ళకు సంక్షేమ
పథకాలు అందుతున్నాయన్నారు.