స్కిల్
డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. కేసులో లోకేశ్‌ను
నిందితుడిగా చూపలేదని, అందువల్ల ఆయనను అరెస్టు చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది.
ఒక వేళ నిందితుల జాబితాలో లోకేశ్ పేరు చేరిస్తే అప్పుడు 41 ఏ నోటీసు జారీ చేసి
విచారిస్తామన్నారు. అరెస్టు చేయబోమని సీఐడీ చెప్పడంతో పిటిషన్‌ను హైకోర్టు
డిస్పోజ్ చేసింది.
అంగళ్ళు
కేసులో మాజీ సీఎం చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ దరఖాస్తు పిటిషన్ పై
హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం
శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది.
సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరిట
ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్ళు మీదుగా వెళుతున్న
సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు సహా
టీడీపీ కి చెందిన 179 మందిపై కురబలకోట
మండలం ముదివేడు పోలీసులు కేసు పెట్టారు. చంద్రబాబు ఏ1 గా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు మినహా అందరికీ న్యాయస్థానాలు
బెయిల్ మంజూరు చేశాయి.