ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ కైపర్ పేరుతో అమెజాన్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందించనుంది. కేంద్రంలోని వివిధ శాఖల అనుమతుల కోసం అమెజాన్ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది.
భూ సమీప కక్ష్యలోని ఉపగ్రహాల సాయంతో అమెజాన్ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఇందుకు నేషనల్ స్పేస్
ప్రమోషన్ అండ్ అథరైజేషన్ కేంద్రానికి అమెజాన్ దరఖాస్తు చేసుకుంది. కేంద్ర టెలికాం శాఖ నుంచి కూడా అనుమతుల కోసం దరఖాస్తు పెట్టుకుంది.
ఉపగ్రహాల ద్వారా తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందించాలని అమెజాన్ భావిస్తోంది. 1జీబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అమెజాన్ అందించనుంది. ఇ కామర్స్ వ్యాపారంతోపాటు, ప్రైమ్ వీడియో సేవలు విస్తరించేందుకు అమెజాన్ ఇంటర్నెట్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని భావిస్తోంది.