బిహార్లో
రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 70
మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. దిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అసోంలోని
కామాఖ్యకు వెళ్తోన్న నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్కు చెందిన ఆరు బోగీలు రఘునాథ్పుర్
వద్ద పట్టాలు తప్పాయి. దీంతో ప్రమాదం సంభవించింది.
పోలీసులు,
రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై
రైల్వే మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని
ఘటనాస్థలికి పంపించామని, క్షతగాత్రుల్ని పట్నాలోని ఎయిమ్స్ కి తరలించామన్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
మృతులకు
రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున
సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేక
రైలు ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.
బిహార్
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రమాదంలో మరణించిన వారికి రూ. 4 లక్షల పరిహారం
ప్రకటించారు.
ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్ లైన్
నంబర్లు అందుబాటులోకి తెచ్చింది.
పాట్నా-9771449971, ధన్పూర్-8905697493, కమాండ్
కంట్రోల్-7759070004, అరా-8306182542, న్యూదిల్లీ-01123341074, 9717631960, ఆనంద్
విహార్ టెర్మినల్-9717632791, కమర్షియల్ కంట్రోల్ దిల్లీ డివిజన్-9717633779.