అమెరికా చరిత్రలో రెండో అతిపెద్ద లాటరీ గెలుచుకున్నాడు ఓ అదృష్టవంతుడు. కాలిఫోర్నియాలోని పవర్‌బాల్ జాక్పాట్లో ఓ వ్యక్తి రూ.14 వేల కోట్లు గెలుచుకున్నాడు. అమెరికా చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద లాటరీ కావడం విశేషం. లాటరీలో 22,24,40,52,64 నెంబర్ వచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటించారు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి 30 ఏళ్లలో రూ.14000 కోట్లు పొందుతాడు. ఏటా రూ.470 కోట్ల వరకు చెల్లిస్తారు. లేదంటే మొత్తం ప్రైజ్‌మనీ ఒకేసారి తీసుకునే వెలుసుబాటు ఉంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి అతను పొందే మొత్తంలో 13.4 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
2022లో కాలిఫోర్నియాలో ఓ విజేత రూ.16 వేల కోట్ల లాటరీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అది అమెరికా చరిత్రలో అతి పెద్ద లాటరీ. ప్రస్తుతం ప్రకటించిన లాటరీ అమెరికా చరిత్రలో రెండో అతి పెద్ద లాటరీగా నిలిచింది. ఈ పవర్‌బాల్ లాటరీని అమెరికాలోని 45 రాష్ట్రాలు, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, ఫ్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్‌లో నిర్వహిస్తారు. టికెట్ ధర రూ.166గా ఉంది. 29.22 కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఈ లాటరీ వరిస్తుంది.