వన్డే
వరల్డ్‌కప్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం
జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. 8
వికెట్లతో తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
ఆప్ఘన్
నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని భారత ఆటగాళ్ళు అవలీలగా ఛేదించారు. నిర్ణీత 50
ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన ఆప్ఘన్ జట్టులో కెప్టెన్ షాహిదీ 80
పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 62 రన్స్ రాబట్టారు. భారత
బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా రెండు,
కుల్దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో
వికెట్ సాధించారు.
ఆప్ఘనిస్తాన్
విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని కేవలం 35 ఓవర్లలోనే భారత జట్టు అందుకుంది.
రోహిత్
శర్మ 84 బంతుల్లో 131 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. అతని
ఇన్నింగ్స్ లో 16 ఫోర్లతో పాటు ఐదు సిక్సులు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 47 పరుగులు చేయగా ఇద్దరి భాగస్వామ్యం 156 పరుగులకు
చేరడంతోనే దాదాపు సగం విజయం ఖాయమైంది.
విరాట్ కోహ్లీ, 56 బంతుల్లో 55 పరుగులు చేయగా,
శ్రేయస్ అయ్యర్ 25 పరుగులు చేశారు. ఆప్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.
వన్డేల్లో
రోహిత్ శర్మ ఇప్పటి వరకు 31 శతకాలు చేయగా, ఈ ఫార్మేట్లో అత్యధిక సెంచరీలు సాధించిన
బ్యాటర్ల జాబితాలో సచిన్(49), కోహ్లి(47) తర్వాత అతడు మూడో స్థానంలో ఉన్నాడు.
63
బంతుల్లో సెంచరీ చేసి ఆప్ఘన్‌తో మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు. కపిల్‌దేవ్ 1983
లో జింబాబ్వే పై 72 బంతులతో నెలకొల్పిన రికార్డును రోహిత్ అధిగమించాడు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్