భారత ఎన్నికల కమిషన్ ఇవాళ రాజస్థాన్
రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చింది. నవంబర్ 23న జరగవలసిన పోలింగ్,
నవంబర్ 25కు మార్చింది.
‘‘నవంబర్ 23న మంచి ముహూర్తం ఉన్నందున ఆ
రోజు రాజస్థాన్లో పెళ్ళిళ్ళు, ఇతర కార్యక్రమాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. అందువల్ల
రవాణా సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఆ రోజు పోలింగ్ నిర్వహిస్తే చాలామంది ప్రజలు
ఓటుహక్కును వినియోగించుకోవడం కష్టం. కాబట్టి పోలింగ్ తేదీని మార్చాలంటూ పలు రాజకీయ
పక్షాలు, సామాజిక సంస్థలు ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసాయి. ఆ వినతులను పరిగణనలోకి
తీసుకున్నాం. ఆ మేరకు పోలింగ్ తేదీని మార్చాం. అన్ని
అంశాలనూ గమనించి, పోలింగ్ తేదీని నవంబర్ 23 నుంచి నవంబర్ 25కు మార్చాం’’ అని
ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మిజోరం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నాడు
విడుదల చేసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి.