టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అంగళ్ళు
కేసులో రేపటి వరకు అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు,
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పీటీ వారెంట్, పోలీసు కస్టడీపై ఎలాంటి ఆదేశాలు
ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు సూచించింది.
చంద్రబాబు
తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, ప్రభుత్వం తరఫున ఏజీ సుబ్రహ్మణ్యం
వాదించారు.
ఏసీబీ
కోర్టు లో పీటీ వారెంట్ పిటిషన్ పై విచారణ ఉన్నందున చంద్రబాబును అరెస్టు చేయకుండా
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దమ్మాలపాటి కోర్టును కోరారు.
అంగళ్ళు కేసులో
నిందితులు బెయిల్, ముందస్తు బెయిల్ పొందారని, చంద్రబాబుకు ఊరట కల్పించాలని
అభ్యర్థించారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయమూర్తికి తెలిపారు.
ఈ
విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు
సూచించింది.
ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ లో ఉందని కోర్టుకు తెలిపిన ఏజీ,
ఈ దశలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ
చేసింది.