ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నలుగురు కొత్త
న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రాష్ట్ర హైకోర్టులో
న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న నలుగురిని, అదే హైకోర్టులో న్యాయమూర్తులుగానియమించవచ్చునని సిఫార్సు చేసింది.
హరినాథ్ నూనేపల్లి, శ్రీమతి కిరణ్మయి మండవ
(కనపర్తి), శ్రీమతి సుమతి జగడం, న్యాయపతి విజయ్ ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో
న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్, మరో
ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదించి ఆ నలుగురి పేర్లనూ సుప్రీంకోర్టుకు
సిఫారసు చేసారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఆ సిఫారసును ఆమోదించారు.
హైకోర్టు సీజే సిఫారసు మేరకు ఆ నలుగురి పేర్లను
సుప్రీంకోర్టు కొలీజియం పరిగణనలోకి తీసుకుంది. ఆ నలుగురి గురించి మరో ఐదుగురు న్యాయమూర్తులను
సంప్రదించింది. వారి ఆమోదంతో ఆ నలుగురు న్యాయవాదులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా
నియమించవచ్చునని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ కొలీజియంలో
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్, న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్,
మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఉన్నారు.