ఇజ్రాయెల్లో హమాస్ మిలిటెంట్ల పాశవిక చర్యలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి.అమాయక ప్రజలను హమాస్ ఉగ్రవాదులు చంపేసిన తీరు కన్నీరు తెప్పిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే దారుణంగా చంపినట్లు భారతీయ టీవీ నటి మధురా నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించి ఆమె విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది.
హమాస్ ఉగ్రదాడుల్లో ఇప్పటికే వందలాది మంది అమాయక ప్రజలు చనిపోయారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు.హమాస్ దాడుల్లో చాలా మంది బంధువులను కోల్పోయాను. వారి ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుంటాయని నటి మధురా గుర్తుచేసుకున్నారు. ఇజ్రాయెల్లో ఉన్న బాధితులందరి కోసం దేవున్ని ప్రార్థిస్తున్నానని, ఉగ్రవాదుల చర్యలు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తున్నామని ఆమె వాపోయారు.